English | Telugu

Divya Drishti Review: దివ్య దృష్టి మూవీ రివ్యూ

తారాగణం: ఇషా చావ్లా, సునీల్, కమల్ కామరాజు, తులసి తదితరులు
దర్శకత్వం: కబీర్ లాల్
ఓటీటీ: సన్ నెక్స్ట్

ప్రేమ కావాలి, పూల రంగడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఇషా చావ్లా.. కాస్త విరామం తర్వాత చేసిన సినిమా 'దివ్య దృష్టి'. టైటిల్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (Divya Drushti Review)

కథ:
భవ్య, దివ్య (ఇషా చావ్లా) ట్విన్ సిస్టర్స్. వీరికి 'డిజెనరేటివ్ ఐ డిసీజ్' ఉంటుంది. దీని వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోతారు. మొదట భవ్య కంటిచూపు కోల్పోతుంది. అయితే అనూహ్యంగా ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోతుంది. భవ్యది ఆత్మహత్య అని అందరూ నమ్ముతారు. దివ్య మాత్రం ఇది హత్యే అనే అనుమానంతో.. తానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ విషయంలో తన భర్త(కమల్ కామరాజు) నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదు. మరోవైపు తన కంటి చూపు కూడా తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దివ్య రిస్క్ చేసి, ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తెలిసిన నిజాలేంటి? భవ్య మరణానికి కారణం ఎవరు? దివ్యను వెంటాడుతున్న అదృశ్య వ్యక్తి ఎవరు? ఇందులో సునీల్ పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దివ్య దృష్టి.. టైటిల్ బాగుంది.. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. త్వరలో కంటిచూపు కోల్పోనున్న ఒకమ్మాయి.. తన సోదరి మరణం వెనకున్న మిస్టరీ తెలుసుకోవాలి అనుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో.. అసలు దీని వెనుక ఎవరున్నారు? తర్వాత ఏం జరగనుంది? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చునేలా చేయవచ్చు. కానీ, ఆ విషయంలో దివ్య దృష్టి టీమ్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

దివ్య ఒక ఈవెంట్ లో ఉండగా.. కంటిచూపు లేని భవ్య, తాను అపాయంలో ఉన్న విషయాన్ని తెలపడం కోసం సోదరికి కాల్ చేస్తుంది. ఆ తర్వాత కాసేపటికే ఉరి వేసుకొని చనిపోతుంది. దీంతో ఇంట్రెస్టింగ్ గానే సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే సినిమాకి కీలకమైన ఇన్వెస్టిగేషన్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేదు. చాలా సీన్స్ ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయడానికే అన్నట్టుగా ఉన్నాయి. ఆ విషయం చూసే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది.

అదృశ్య వ్యక్తి ట్రాక్ కూడా అంత ప్రభావవంతంగా లేదు. ఆ వ్యక్తి చాలా డేంజర్ అన్నట్టుగా మాటల్లో చెప్పించారు కానీ.. అతను రివీల్ అయ్యాక దానికి తగ్గ సన్నివేశాలు పడలేదు. పైగా ఆ ట్రాక్ కాస్త గందరగోళంగానూ ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో సినిమా స్టార్టింగ్ సీన్స్ తర్వాత, కాస్త ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో సినిమా పుంజుకుంది. అయితే విలన్ ని రివీల్ చేసే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.

ఇన్వెస్టిగేషన్ సీన్స్ సిల్లీగా, హీరోయిన్ కి అన్నీ కన్వీనెంట్ గా జరిగినట్టుగా ఉంటాయి. అలాగే, ఒక చిన్న పాప వచ్చేసి.. ఇతనే విలన్ అని రివీల్ చేసి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పేయడం కూడా సిల్లీగా ఉంది.

హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే.. ఆమె థ్రిల్ అవ్వడమే కాకుండా, చూసే ఆడియన్స్ కూడా థ్రిల్ అవ్వాలి. కానీ, ఇందులో హీరోయిన్ పెద్దగా కష్టపడకుండానే.. అందరూ ఆమెకి అన్నీ విషయాలు చెబుతుంటారు. దాంతో కిక్ లేకుండా పోయింది. అదే సినిమాకి మైనస్ అయింది.

టెక్నికల్ గా కూడా సినిమా గొప్పగా లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు కీలకమైన కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల పనితీరు సోసో గానే ఉంది.

ఫైనల్ గా..
దివ్య దృష్టి.. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ, దానిని తెరపైకి ఆసక్తికరంగా తీసుకురావడంలో తడబడ్డారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు.. అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ట్రై చేయొచ్చు.

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.