English | Telugu

ప్రశాంత్ వర్మ బ్యాడ్ టైం.. ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్..!

దర్శకుడు ప్రశాంత్ వర్మకు వరుస షాక్ లు
ఓ వైపు నిర్మాతల ఫిర్యాదులు
మరోవైపు ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి 2, బ్రహ్మ రాక్షస వంటి పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

హనుమాన్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇంతవరకు తన దర్శకత్వంలో మరో సినిమాని పట్టలెక్కించలేదు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన బ్రహ్మ రాక్షస ఆగిపోయింది. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటనకే పరిమితమైంది. హనుమాన్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాకముందే ఎండ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Prasanth Varma)

ప్రభాస్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని ప్రశాంత్ వర్మ దక్కించుకున్నారు. ఇది రణవీర్ సింగ్ తో చేయాలనుకున్న బ్రహ్మ రాక్షస అనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడినట్లు న్యూస్ వినిపిస్తోంది.

Also Read: జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టైం అంతగా బాలేదు. ప్రశాంత్ వర్మ వల్ల తమకు నష్టం జరిగింది అంటూ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. హనుమాన్ తర్వాత అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తానని రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని ఆరోపించారు. అలాగే, మరో పది కోట్లతో ఆక్టోపస్ అనే సినిమా రైట్స్ కొనిపించారని పేర్కొన్నారు. అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయట్లేదని, తమకి జరిగిన నష్టానికి పరిహారంగా రూ.200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అయితే హనుమాన్ నిర్మాత ఆరోపణలను ప్రశాంత్ వర్మ ఖండించారు. తాను అడ్వాన్స్ లు తీసుకొని సినిమాలు చేయట్లేదన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. నిజానికి హనుమాన్ లాభాల్లో తనకి వాటా ఇవ్వాల్సి ఉందని.. అది ఇవ్వకపోగా, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మరోవైపు ప్రశాంత్ వర్మ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడం ప్రశాంత్ వర్మ బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.