English | Telugu

సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలిపే చిత్రం 'వారణాసి'.. ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి 'వారణాసి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'వారణాసి' టైటిల్ తో తెలుగులో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పని చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ‘రఫ్’ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే గ్రాండ్ లాంచ్ తో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

Also Read: ప్రశాంత్ వర్మ బ్యాడ్ టైం.. ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్..!

ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా, ఓ స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దీంతో ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరనే చర్చ జరుగుతోంది.

భారతదేశంలో అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమా క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం