English | Telugu

Mass Jathara : ‘మాస్‌ జాతర’కు మొదట అనుకున్న హీరో రవితేజ కాదు.. ఆ హీరో ఎవరో తెలుసా?

- ‘మాస్‌ జాతర’కు మొదట అనుకున్న హీరో

- ‘మాస్‌ జాతర’ గురించి ప్రేక్షకులు ఏమంటున్నారంటే..?

- రవితేజ ఎనర్జీ ప్లస్ అయిందట

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌ విచిత్రంగా సెట్‌ అవుతూ ఉంటాయి. ఒక హీరోతో అనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల మరో హీరో చేస్తారు. అందులో కొన్ని సూపర్‌హిట్‌ అవుతాయి, మరికొన్ని ఫ్లాప్‌ అవుతుంటాయి. ఏ హీరో ఏ క్యారెక్టర్‌ చెయ్యాలి అనేది ముందే డిజైన్‌ చేసి ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీలో బాగా ఉంది. ఒక హీరోతో అనుకున్న సినిమాను మరో హీరో చేసిన సందర్భాలు అనేకం వున్నాయి.

తాజాగా రవితేజ(Raviteja) హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ‘మాస్‌ జాతర’(Mass Jathara) అక్టోబర్‌ 31న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ ఉన్నప్పటికీ రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడని, విలన్‌గా నటించిన నవీన్‌ చంద్ర పెర్‌ఫార్మెన్స్‌ బాగుందనే టాక్‌ వినిపిస్తోంది. రవితేజ, శ్రీలీల(Sreeleela) పాటల్లో వేసిన స్టెప్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.

గతంలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కొన్ని సినిమాల్లో నటించారు. మరోసారి ‘మాస్‌ జాతర’తో అలాంటి క్యారెక్టర్‌లో కనిపించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్‌, యాక్షన్‌ సీక్వెన్సులను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ సినిమాను మొదట రవితేజతో చెయ్యాలని దర్శకుడు అనుకోలేదట. అంతకుముందు కొన్ని సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించిన గోపీచంద్‌(Gopichand)కి ఈ కథను చెప్పారు డైరెక్టర్‌ భాను. అప్పటికి గోపీచంద్‌ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా చెయ్యలేకపోయారు. దాంతో ఈ కథ రవితేజ దగ్గరికి వచ్చింది. కథ విన్న రవితేజ తనకు యాప్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ అనుకున్నారు. తన నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయని రవితేజ ఫీల్‌ అయ్యారు. అందుకే వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం