English | Telugu
కార్తీకి ధనుష్ కోటి రూపాయిలు ఇచ్చాడు
Updated : May 14, 2024
ధనుష్..ఈ పేరు చెప్తే తమిళనాడు సినీ ప్రేక్షకలోకం మొత్తం ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో అత్యధ్బుతమైన పాత్రల్లో నటించి అంతలా ప్రేక్షాభిమానాన్ని పొందాడు.అదే విధంగా ధనుష్ మూవీ రెగ్యులర్ మూవీ కాదు అనే ఘనతిని కూడా పొందాడు. లేటెస్ట్ గా తమిళ సినీ రంగం కలలు కంటున్న ఒక కార్యక్రమానికి నేను ఉన్నాను అనే భరోసాని అందించి రియల్ హీరో అని అనిపించుకున్నాడు
నడిగర్ సంఘం. తమిళ సినీ కళాకారుల చిరకాల స్వప్నం. సూటిగా చెప్పుకోవాలంటే నటినటులకి సంబంధించిన భవనం. ఇప్పుడు ఈ భవన నిర్మాణానికి ధనుష్ కోటి రూపాయిల భారీ విరాళాన్ని ఇచ్చాడు. ఈ మేరకు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ని కలిసి కోటి రూపాయిల చెక్కుని అందించాడు. ధనుష్ అంత పెద్ద మొత్తం ఇచ్చినందుకు ప్రముఖ హీరో కార్తీ దన్యవాదాలు తెలిపాడు.నడిగర్ సంఘానికి కార్తీ కోశాధికారిగా ఉన్నాడు. ఇంకో ప్రముఖ హీరో విశాల్ ప్రధాన కార్యాధికారిగా ఉన్నాడు.గతంలో విశ్వ కథానాయకుడు కమల్ హాసన్, ఇళయ దళపతి విజయ్ లు కూడా నడిగర్ సంఘానికి కోటి రూపాయలు ఇచ్చారు. శివ కార్తికేయన్ యాభై లక్షలు అందించాడు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి
ఇక సినిమాల పరంగా చూసుకుంటే ధనుష్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి కుబేర కాగా రెండోది రాయన్. కుబేర లో యువ సామ్రాట్ నాగార్జునతో కలిసి చేస్తున్నాడు. ఇటీవల బయటకి వచ్చిన ధనుష్ లుక్ సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది. రాయన్ కూడా సోషల్ మీడియా లో బిజీగా ఉంది. పైగా దర్శకత్వం కూడా తనే చేస్తున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. మరి కొన్ని ప్రాజెక్టు లు కూడా చర్చల దశలో ఉన్నాయి