English | Telugu

నాగచైతన్య దడ టీజర్ ట్రైలర్

నాగచైతన్య "దడ" టీజర్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందట. వివరాల్లోకి వెళితే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయంచేస్తూ యువనిర్మాత డి.విశ్వచందన్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం"దడ". నాగచైతన్య "దడ" టీజర్ ట్రైలర్ ని ఈ చిత్రం ఆడియో విడుదలకు ఓ రెండు వారాల ముందుగా విడుదల చేయాలని నిర్ణయించారు. నాగచైతన్య "దడ" ఫస్ట్ లుక్ దానికన్నా ముందు అంటే వచ్చే వారం విడుదల చేస్తారు.

నాగచైతన్య "దడ" ఆడియోని జూలై రెండవ వారంలో విడుదల చేస్తారు. ఈ నాగచైతన్య "దడ" సినిమాని ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేయనున్నారట. నాగచైతన్య "దడ" సినిమాలో నాగచాచైతన్యకు అన్నయ్యగా శ్రీరామ్ నటిస్తూండగా, శ్రీరామ్ కు జోడీగా సమీక్ష నటిస్తూంది. అమెరికాలో చదువుకుని ఇండియాకి వచ్చిన విద్యార్థిగా ఈ సినిమాలో నాగచైతన్య నటిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.