English | Telugu

యాక్షన్ సీన్ల షూటింగ్ లో రానా నా ఇష్టం

యాక్షన్ సీన్ల షూటింగ్ లో రానా "నా ఇష్టం" సినిమా ప్రస్తుతం మలేసియాలోని కౌలాలంపూర్ లో జరుగుతూంది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, హాసిని పాప జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న సినిమా "నా ఇష్టం". రానా "నా ఇష్టం" సినిమా యాక్షన్ సీన్ల షూటింగ్ మలేసియాలోని కౌలాలంపూర్ లో స్టన్ శివ, రజబ్ ఫైట్ మాస్టర్ల నేత్రుత్వంలో శరవేగంగా జరుగుతోంది.

అక్కడే ఈ యాక్షన్ సీన్ల షూటింగ్ మరో రెండు వారాల పాటు చిత్రీకరిస్తారు. మలేసియాలో ఈ రానా "నా ఇష్టం" సినిమాలోని తొలి పాటను హీరో, రానా, హీరోయిన్ జెనీలియాలపై, నిక్సన్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. హీరోయిన్ జెనీలియా పాత్ర షూటింగ్ దాదాపుగా అయిపోయిందట. రానా "నా ఇష్టం" సినిమాకి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూండగా, చక్రి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.