English | Telugu

ఈగలో కాజల్ ఐటమ్ సాంగ్ లేదు

"ఈగ" లో కాజల్ ఐటమ్ సాంగ్ లేదు అని ఆ చిత్ర దర్శకుడు యస్.యస్.రాజమౌళి తెలిపారు. వివరాల్లోకి వెళితే నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో, సురేష్ బాబు సమర్పణలో, కొర్రపాటి సాయి నిర్మిస్తున్న చిత్రం"ఈగ". ఈ "ఈగ" చిత్రం కోసం భారీ గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అయిదు కోట్లు ఖర్చుపెడుతున్నారని వినికిడి. సెంథిల్ కుమార్‍ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, యమ్ యమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

"ఈగ" సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తూందని ఒక రూమర్ ఫిలిం నగర్ లో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. అది తెలుసుకున్న "ఈగ" చిత్ర దర్శకుడు రాజమౌళి " అది నిరాధారమైన వార్త. ఈగ సినిమాలో కాజల్ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నదనేది ఒక రూమర్ మాత్రమే కాని నిజం కాదు" అని మీడియాకు తెలియజేశారు. దీన్ని బట్టి నిజం కన్నా గాసిప్ కి బలం ఎక్కువని తెలుస్తూంది కదా....!

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.