English | Telugu

దాసరి జన్మదిన ఉత్సవాల విశేషాలు

ప్రతీ సంవత్సరం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా పురస్కారాలు ప్రధానం చేస్తున్నారని దాసరి జన్మదిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... "ప్రతీ యేటా మే 4న దాసరి నారాయణరావు జన్మదినం ఓ ఉత్సవంలా జరుగుతోంది. పేద విద్యార్థులకు, కళాకారులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా లఘుచిత్రాల పోటీని నిర్వహించాం. చక్కటి స్పందన లభించింది. 175 చిత్రాలు పోటీకి వచ్చాయి. అందులో 40 సినిమాలను ఎంపిక చేశాం. వాటిలో ఐదింటిని ఎంపిక చేసి ఆ చిత్ర దర్శకనిర్మాతలకు బహుమతులు అందజేస్తాం. తొలి ఉత్తమ చిత్రానికి రూ.10వేలు, రెండవ ఉత్తమ చిత్రానికి రూ.7500, మూడు,నాలుగు, ఐదవ స్థానాలలో వచ్చిన ఉత్తమ చిత్రాలకు రూ.5వేల చొప్పున బహుమతులు ప్రధానం చేయనున్నాం" అని అన్నారు. లఘుచిత్రాలు తీసి సినీ దర్శకులైన తనికెళ్ళ భరణి, మేర్లపాక గాంధీ, విరించి వర్మ, పవన్ సాధినేని, ప్రదీప్ మాడుగుల, రామ్ భీమనలు దాసరి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనట్టు తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.