English | Telugu

విషం ఇవ్వండంటున్న దర్శన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం 

కన్నడ హీరో 'దర్శన్'(Darshan)కి 'రేణుకస్వామి'(Renuka Swami)హత్యకేసులో హైకోర్ట్ ఇచ్చిన బెయిల్ ని ఇటీవల 'సుప్రీంకోర్ట్'(Supreem Court)రద్దు చేసిన విషయం తెలిసిందే. పైగా తన తీర్పులో చట్టానికి ఎవరు అతీతులు కాదని, జైలులో దర్శన్ కి ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని కూడా స్పష్టం చేసింది.

'దర్శన్' ప్రస్తుతం బెంగళూరు(Bengaluru)లోని 'పరప్పన అగ్రహార జైలు(parappana agrahara jail)లో ఉన్నాడు. కేసులో భాగంగా తాజాగా దర్శన్ సిటీ సివిల్, సెషన్ కోర్టు న్యాయమూర్తితో జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. ఈ సంధర్భంగా న్యాయమూర్తితో దర్శన్ మాట్లాడుతు 'జైలులో సరైన సదుపాయాలు లేవు. కొన్ని రోజులుగా సూర్యరశ్మిని చూడలేదు. దుస్తులు దుర్వాసన వస్తున్నాయి. ఫంగస్ తీవ్రత భయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. నాకు విషం ఇవ్వండి.ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉందని వేడుకున్నట్టుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో పరప్పన జైలులో దర్శన్ కి ప్రత్యేక సదుపాయాలు కలిపించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం జైలుని మూడు వేర్వేరు యూనిట్లుగా విభజించింది. ఈ కేసులో మరో నిందితురాలు, దర్శన్ ప్రియురాలైన ప్రముఖ హీరోయిన్ పవిత్ర గౌడ(Pavithra Gowda)కూడా పరప్పన అగ్రహార జైలులో ఉంది. దర్శన్‌ మొదట నుంచి బళ్లారి జైలులో ఉన్నాడు. దీంతో అక్కడి జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసారు.ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉండగా, దర్శన్ పరప్పర జైలు గురించి ఫిర్యాదు చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి ఇటీవల దర్శన్ కోర్ట్ కి హాజరయినప్పుడు దర్శన్ ని ఉరి తియ్యండని, ఒక వ్యక్తి గొడవ చేసిన విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.