English | Telugu
మెగాస్టార్ 150 వ సినిమా లేదు
Updated : Jun 28, 2011
మెగాస్టార్ 150 వ సినిమా లేదు అని స్వయంగా మెగాస్టార్ చెప్పటం మెగా అభిమానులకు చాలా నిరాశ, బాధ కలిగించే విషయం. వివరాల్లోకి వెళితే ఇటీవల మీడియా "మీరు నటించబోయే 150 వ సినిమా ఎప్పుడుంటుంది....?" అని అడిగితే దానికి జవాబుగా "నేను పూర్తిస్థాయిలో ప్రజాసేవకే అంకితమయ్యాను. ఇక సినిమాల్లో నటించటం కుదరదు. ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అందుకని సినిమాల్లో ఇక మీదట నటించకూడదని నిర్ణయించుకున్నాను. సినిమాల విషయానికొస్తే మా అబ్బాయి రామ్ చరణ్ లోనే నన్ను చూసుకోవలసిందిగా నా అభిమానులకు విజ్ఞప్తిచేస్తున్నాను." అని మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి అన్నారు.
ఇది మెగా అభిమానులకు మింగుడుపడని విషయం. అత్యంత నిరాశకు గురిచేసే విషయం. అన్నయ్య 150 సినిమా కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్న వారికి ఇది శరాఘాతమే. అయితే అన్నయ్య మాట ప్రకారం సినిమాల్లో ఆయన్ని రామ్ చరణ్ లోనే చూసుకుంటూ, రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి అవటానికి దోహదపడాలని ఆశిద్దాం.