English | Telugu

అమృతమా.. అమృతాంజనమా..

చందమామలో అమృతం - రివ్యూ
అమృతం సీరియల్ గురించి ఆల్ రెడీ తెలిసిన వారు, ఆ సీరియల్ గంగరాజుదే అని తెలిసిన వారు ఈ సినిమాకు ఏ ఎక్స్ పెక్టేషన్ లేకుండా వెళితే కాసేపు నవ్వుకొని వస్తారు. "వీళ్ళకి వెండి తెర ఇచ్చిన బుల్లి తెర బుద్దులు పోలేదు" అని ఇందులో ఉన్న డైలాగ్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది చిత్రం మొత్తం చూశాక.
బాగా పాపులర్ అయిన అమృతం సీరియల్ పాత్రలను తీసుకొని వాటి చుట్టూ కథను అల్లుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. కాని కథనంలో లోపాలు డిసపాయింట్ చేస్తాయి. చిత్రంలో వేగం కన్నా టైంపాస్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. సాగదీస్తున్నట్టు సాగే కథనం, కామెడీ పాలు తక్కువై సాదాసీదాగా సాగిపోతుంది. చంద్రుడి మీద సాగే సన్నివేశాలలో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
సీరియల్ లో లాగానే అమృతం(శ్రీనివాస్ అవసరాల), అతని స్నేహితుడు ఆంజనేయులు (హరీష్) ఒక హోటల్ ని నడుపుతు సాదా సీదాగా జీవితం గడుపుతుంటారు. అనుకోకుండా వచ్చిన రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల వాళ్ల జీవితాల్లో పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. వారు రాత్రికి రాత్రి కొన్ని వేల కోట్లకు అధిపతులవుతారు. ఇదిలా వుండగా వీరికి చంద్రమండలానికి ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు చేసే సంస్థలో పనిచేసే చంద్రమోహన్(రావు రమేష్) పరిచయం అవుతాడు. అంజి, అమృతం ఎలాగైనా చంద్రుడి మీద కాలు మోపాలని డిసైడ్ అవుతారు. దాని కోసం వారు ఏం చేస్తారు, అసలు వెళ్లారా లేదా అనేది తర్వాత కథ.
ఇక చిత్రంలో సంగీతం గురించి చెప్పాలంటే సినిమాలో పాటలన్నీ రీమేక్ చేసిన పాత పాటలే. కొత్తగా ఇవి ఆకట్టుకోవడం ఏమీ లేక పోగా పాతవే మేలనిపిస్తాయి. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎడిటింగ్ కు అవకాశం ఉన్న చోట కూడా సన్నివేశాలను ఎడిటర్ అలాగే ఎందుకు వదిలేసినట్లు అనిపిస్తుంది.
సిన్ లాడెన్, ఈజిప్ట్ లోని పిరమిడ్స్ లాంటి కొత్త కొత్త అంశాలు కొంత ఆసక్తి కలిగిస్తాయి. అమృతం ఇంపాక్ట్ సృష్టించడంలో అవసరాల శ్రీనివాస్ కొంత విజయం సాధించాడు. మిగిలిన పాత్రలు వారి స్థాయికి తగినట్టుగా ఆకట్టుకోలేకపోయారు. సంజు పాత్రలో నటించిన ధన్య బాల కృష్ణన్ అందంగా కనిపించింది. శాంతం పాత్రలో నటించిన నటి ఆకట్టుకోలేకపోయింది.
సైన్సు ఫిక్షన్ కి కామెడీ అంశాలతో ఆల్ రెడీ పాపులర్ అయిన అమృతం పాత్రలతో చిత్రాన్ని మలిచేశారు. కథకు కామెడీని జోడిస్తూ, సైన్సుని, ఆ తరువాత కామన్ విషయాలను మరిచిపోయారు. సైన్సు ఫిక్షన్ సినిమా కొంతయినా సైన్సు గురించి చెప్పగలిగే ఈ చిత్రం కావాలి. ఈ చిత్రం ఏం నేర్పించకపోగా మనకి వచ్చిన భౌతిక శాస్త్రం మీద సందేహం కలిగేలా చేస్తుంది. కామెడీ కోసం శాస్త్రాన్ని మార్చాల్సిన పని లేదు, ఆక్సిజన్ లేనిచోట చెట్లు ఎలా పెరుగుతాయి? లాంటి సందేహాలు చిత్రం చూస్తున్నప్పుడు చాలానే కలుగుతాయి.
చివరగా అమృతం బ్రాండ్ తో సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఒరిజినల్ అమృతం ధారవాహిక అభిమానులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం కష్టమే.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.