English | Telugu

28 మందిని చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలి 

భారతీయ చిత్ర పరిశ్రమ మొదట్నుంచి కూడా మన దేశంలో ఏదైనా దురదృష్ట సంఘటనలు జరిగితే వాటిపై స్పందిస్తు భారతీయులంతా(Indians)ఒక్కటే అని తెలియచేస్తు ఉంటుంది. నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్(Kashmir)లోని పహాల్గమ్(Pahalgam)ఏరియాలో ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి కొంత మంది టూరిస్ట్ లు వచ్చారు. దీంతో ఉగ్రవాద మూక వాళ్లపై దాడి చేసి 28 మందిని అత్యంత పాశవికంగా చంపారు.

ఈ విషయంపైసోషల్ మీడియా వేదికగా చిరంజీవి(Chiranjeevi)స్పందిస్తు '28 మంది అమాయకులని బలిగొన్న దారుణమైన ఉగ్ర దాడి క్షమించరాని క్రూరమైన చర్య. హృదయ విధాకరమైన ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకి నా సానుభూతిని తెలుపుతున్నాను. ఈ నష్టం తీర్చలేనిదనిట్వీట్ చేసాడు. ఎన్టీఆర్(Ntr)స్పందిస్తు 'బాధితుల్ని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతుంది. శాంతి కోసం ప్రార్ధించడంతో పాటు మృతుల కుటుంబాలకి నా సానుభూతిని తెలియచేస్తున్నాన్నంటు ట్వీట్ చెయ్యడం జరిగింది.

బాలీవుడ్ నటులు సంజయదత్(Sanjay dutt)అక్షయ్ కుమార్(Akshay Kumar)కూడా స్పందిస్తు అమాయకులని చంపడం చాలా దారుణం. ఎట్టి పరిస్థితులోను ఇది క్షమించరాని నేరం. ఈ ఉగ్ర చర్యపై అందరు మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు. అనుపమ్ ఖేర్(Anupam Kher)అయితే జరిగిన ఘటనపై కన్నీళ్లు పెట్టుకుంటు ఒక వీడియో కూడా చెయ్యడం జరిగింది. వీళ్ళే కాకుండా ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు ఉగ్రచర్యని ఖండిస్తు సోషల్ మీడియా వేదికగా బాధితులకి తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.