English | Telugu

నానికి అందని ద్రాక్షలా మారిన విజయ్ రికార్డు!

టాలీవుడ్ యూత్ స్టార్స్ లో టాప్-2 ఎవరంటే నాని (Nani), విజయ దేవరకొండ (Vijay Deverakonda) పేర్లు చెబుతారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాది, సినిమాల సంఖ్య, విజయాల పరంగా చూస్తే.. విజయ్ కంటే నాని చాలా ముందున్నాడు. అలాగే ప్రస్తుతం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండగా.. నాని మాత్రం 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అన్నింట్లోనూ ముందున్న నాని.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయాడు.

టైర్ 2 స్టార్స్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా విజయ్ దే. విజయ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'గీత గోవిందం' 2018లో విడుదలై రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా వచ్చి ఏడేళ్ళవుతున్నా ఇంతవరకు ఈ రికార్డుని నాని బ్రేక్ చేయలేకపోయాడు. 2023లో వచ్చిన 'దసరా'తో నాని ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని భావించారంతా. ఆ అంచనాలకు తగ్గట్టే రికార్డు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఫుల్ రన్ లో రూ.120 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. మరో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లయితే.. 'గీత గోవిందం' రికార్డు బ్రేక్ అయ్యి ఉండేది.

'దసరా' తర్వాత 'హాయ్ నాన్న' అనే క్లాస్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు నాని. ఇది రూ.75 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది. అనంతరం 'సరిపోదా శనివారం' అనే మరో మాస్ సినిమాతో వచ్చి, మరోసారి రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాడు. కానీ ఫుల్ రన్ లో ఇది దసరాను కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు హిట్-3 పై అందరి దృష్టి పడింది.

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హిట్-3'. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో.. 'హిట్-3'పై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా నాని మునుపెన్నడూ లేనంత వయలెంట్ గా కనిపిస్తున్నాడు. 'హిట్-3'తో మరో రూ.100 కోట్ల సినిమా.. నాని ఖాతాలో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాతోనైనా నాని 'గీత గోవిందం' రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు 'గీత గోవిందం' రికార్డుని విజయ్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఈ ఏడేళ్ళలో విజయ్ నుంచి ఏడు సినిమాలు రాగా, అందులో ఒకటి కూడా వంద కోట్ల క్లబ్ లో చేరలేదు. విజయ్ తన నెక్స్ట్ మూవీ 'కింగ్ డమ్'తో కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .