English | Telugu

ఉగ్రదాడిపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. జమ్మూ కాశ్మీర్ అందుకు రెడీగా ఉండాలి

జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)అనంత్‌నాగ్(Ananth Nag)ప్రాంతంలోని పహల్గామ్‌(Pahalgam)లో ఉగ్రవాదులు దాడి జరిపి అమాయకులైన 28 మంది టూరిస్ట్ లని చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇరవై మంది గాయపడ్డారు. జరిగిన ఈ దారుణంపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్పందించడం జరిగింది.

ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'ఉగ్రవాద దాడి వార్త నన్ను తీవ్రంగా బాధించింది. పహల్గామ్‌ ని 'మినీ స్విట్జర్లాండ్" అని పిలుస్తారు. 27 మంది అమాయక పర్యాటకులు మరణించడం,20 మంది గాయపడటం చాలా భయంకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ(Narendra Modi)నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని రూపాల్లో నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి .

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు కేంద్ర దళాలతో పూర్తి సమన్వయాన్ని నిర్ధారించుకోవాలని, పర్యాటకులు, స్థానిక పౌరుల ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఉగ్రవాద ముప్పులను తొలగించడంతో పాటు జాతీయ భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాత్మక చర్యకైనా దేశంలోని పౌరులందరు పూర్తి మద్దతు ఇస్తారంటు ట్వీట్ చేసాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.