English | Telugu
కెప్టెన్ మిల్లర్ మూవీ ఎన్ని భాగాలో తెలుసా?
Updated : Jun 15, 2023
ధనుష్ హీరోగా నటించిన సర్ బంపర్ హిట్ అయింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేస్తున్న కెప్టెన్ మిల్లర్ మీద కూడా అదే రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన థిక్ బియర్డ్, పొడవాటి జుట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ధనుష్‌ని రగ్డ్ అవతార్‌లో చూసిన వారందరూ నెక్స్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్ పక్కా మాస్ మసాలా సినిమా అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా ట్రయాలజీ అని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ త్రీ చాప్టర్ ఫ్రాంఛైజీ అని ఓ అభిమాని ట్వీట్ చేయడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
వెంటనే దీనికి సంబంధించిన డీటైల్స్ షేర్ అవుతున్నాయి. ఫస్ట్ చాప్టర్‌ని 1940ల్లో కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారట. సెకండ్ చాప్టర్‌లో 1990ల్లో కథ చెబుతారట. మూడో చాప్టర్‌లోనే మోడ్రన్ డేస్ కథ ఉంటుందన్నది స్ప్రెడ్ అవుతున్న వార్త. ఈ ఏడాదే ఫస్ట్ పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమాలో హీరోగా నటించనున్నారు ధనుష్. కెప్టెన్ మిల్లర్ మూడు పార్టుల్ని పూర్తి చేసి శేఖర్ మూవీలో జాయిన్ అవుతారా? లేకుంటే అంతకన్నా ముందే వస్తారా? అనేది నిదానం మీద తెలుస్తుంది. శేఖర్ సినిమా పూర్తయ్యాక రాయన్ సినిమా చేస్తారు. రాయన్ మూవీ కథ, డైరక్షన్ పూర్తిగా ధనుష్‌దే.