English | Telugu

"బొబ్బిలి రాజా"రీమేక్ లో రానా

గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, హీరోయిన్ గా దివ్యభారతి, ముఖ్యపాత్రల్లో వాణిశ్రీ, కోట శ్రీనివాసరావు తదితరులు నటించగా, బి.గోపాల్ దర్శకత్వంలో, డి.సురేష్ బాబు నిర్మించిన "బొబ్బిలిరాజా"చిత్రం చాలా పెద్ద హిట్టయ్యింది. అదే చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు హీరో వెంకటేష్ ఒకప్పుడు మీడియాతో అన్నారు కూడా.కానీ ఇప్పుడదే సినిమాని తన అన్న కుమారుడూ, యువ హీరో రానాతో పునర్నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.రానాకి మాస్ హీరో ఇమేజ్‍ ని తీసుకొచ్చేందుకు ఈ చిత్రం ఎంతగానో దోగదపడుతుందని సురేష్ ప్రొడక్షన్స్ అభిప్రాయపడుతూంది.ఈ చిత్రానికి సమబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలయ్యాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.