English | Telugu

రాజాసాబ్ పై మొదలైన బాలీవుడ్ కామెంట్స్..తెలుగు వాళ్లంటే ఏమనుకుంటున్నారు 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)నటించిన 'ఆదిపురుష్' గత సంవత్సరంప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.రాముడిగా ప్రభాస్ నటించిన తీరుకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. వంద కి పైగా చిత్రాలని నిర్మించిన ఆయన రీసెంట్ గా యానిమల్,భూల్ బులయ్య పార్ట్ 3 తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.

భూషణ్ కుమార్ రీసెంట్ గా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాజా సాబ్(raja saab)గురించి మాట్లాడుతు నేను రాజా సాబ్ మూవీలోని కొన్ని విజువల్స్ చూసాను.వాటిని చూస్తుంటే హాలీవుడ్ మూవీ 'హ్యారీ పోటర్' రేంజ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.దీంతో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా రాజా సాబ్ రేంజ్ కూడా ఊహకి అందని విధంగా ఉంది.ఇక ప్రభాస్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు,భూషణ్ కుమార్ కామెంట్స్ ని నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజా సాబ్ మేకర్స్ మొదటి నుంచి కూడా మా మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ ఒక రేంజ్ లో ఉంటాయని చెప్తున్న విషయం తెలిసిందే.

సాలిడ్ హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నరాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ పది న విడుదల కాబోతుందని మేకర్స్ అధికార ప్రకటన కూడా ఇచ్చేసారు.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కూడా మోషన్ టీజర్ రిలీజ్ అయ్యి మూవీ మీద అంచనాలని పెంచేసింది. మారుతి(maruthi)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వ ప్రసాద్(tj viswaprasad)నిర్మిస్తుండగా నిది అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.