English | Telugu

భోళా మేనియా షురూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11 న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇటీవల ఈ సినిమా దసరాకు వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న 'భోళా శంకర్' మూవీ ప్రమోషన్స్ కి పాటలతో శ్రీకారం చుడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'భోళా మేనియా త్వరలోనే ప్రారంభం కానుంది' అంటూ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. బ్యాక్ గ్రౌండ్ లో జాతర వాతావరణం తలపిస్తుండగా, చిరంజీవి అటువైపు తిరిగి వెనుక జేబుల్లో చేతులు పెట్టుకొని ఉన్న డ్యాన్సింగ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇది మూవీలో ఇంట్రో సాంగ్ అనిపిస్తోంది. అలాగే పోస్టర్ లో సినిమాని ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 'భోళా శంకర్' వాయిదా అనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. 'భోళా శంకర్'తో ఆ జోరుని కొనసాగిస్తారేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.