English | Telugu
భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్..సెన్సార్ టాక్
Updated : Oct 14, 2023
ఇప్పుడు దసరా సెలవులతో యూత్ ఎంత హుషారుతో ఉందో బాలయ్య అభిమానులు కూడా భగవంత్ కేసరి సినిమా విషయం లో అంతే హుషారుతో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ నెల 19 న రిలీజ్ కాబోతుంది. ఇప్ప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో బాలయ్య అభిమానులు బెనిఫిట్ షో టిక్కెట్ల కోసం తిరుగుతున్నారు. ఈ సినిమా పై అటు ప్రేక్షకుల్లోను, అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పుడు వాళ్ళ అంచనాలని రెట్టింపు చేసేలా సెన్సార్ వాళ్ళుసినిమా చూసిబాగుందని అన్నారు
బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి ఈ నెల 19 న విడుదల కాబోతుంది. అలాగే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇటీవలే హనుమకొండ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ట్రైలర్ చూసిన అభిమానులు సరికొత్త బాలయ్య ని చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆహా లో ప్రారంభం కాబోయే అన్ స్టాపబుల్-3 లో కూడా భగవంత్ కేసరి టీం కనువిందు చేయబోతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే భగవంత్ కేసరి సినిమా ఇటీవలే సెన్సార్ ని పూర్తి చేసుకుంది .యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ వారు మూవీని ప్రశంసించడంబాలయ్య అభిమానులని ఆనందం లో ముంచెత్తుతుంది.అలాగే ఫస్ట్ ఆఫ్ లో బాలయ్య,శ్రీ లీల ల మధ్య సెంటిమెంట్ అదిరిపోయిందని సెకండ్ ఆఫ్ లో అయితే బాలయ్య గెటప్ చాలా కొత్తగా ఉందని రేపు థియేటర్స్ లో ఆ గెటప్ కి మోత మోగిపోవడం ఖాయమనిఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు జై బాలయ్య అంటూ తెలుగు ఇండస్ట్రీ లో ఇంకో రికార్డు నమోదు కాబోతుందని అంటున్నారు. ఎప్పుడెప్పుడు తెర మీద బాలయ్య ని చూస్తామా అని ఆశతో కేలండర్ లో 19 వ తారీకు కోసం ఎదురు చూస్తున్నారు. 2 గంటల 44 నిమిషాల నిడివితో సినిమా ఉండబోతుంది
.