English | Telugu

బైరెడ్డి తర్వాతే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్.. సంచలన కాంబో 

కట్ అవుట్ కి తగ్గట్టుగా యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ల్లో మంచి ఈజ్ చూపించే హీరో బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas)ఇప్పుడు వరుస పెట్టి కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.దీంతో రెండు మూడు రోజులకైనా బెల్లంకొండ సినీ డైరీ లో చోటు సంపాదిస్తునే ఉన్నాడు. ఇప్పుడు మరో సారి కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినీ డైరీ కి రెస్ట్ లేకుండా చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఆ మూవీ క్రేజీ కాంబో గా మారనుంది.


బెల్లంకొండ అప్ కమింగ్ మూవీ టైసన్ నాయుడు(tyson naidu)పవన్ కళ్యాణ్(pawan kalyan)తో బీమ్లా నాయక్ ని తెరకెక్కించిన సాగర్ కె చంద్ర దర్శకుడు. మరికొన్ని రోజుల్లో బెల్లంకొండ ఈ మూవీకి గుమ్మడి కాయ కొట్టనున్నాడు. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే గీత ఆర్ట్స్ చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ దర్శకత్వంలో ఒక మూవీ ప్రారంభించాడు. ఆ వెంటనే BSS 12 పేరుతో తెరకెక్కబోయే మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మూన్‌షైన్ పిక్చర్స్ ఆ చిత్రాన్ని ప్రకటించింది. వారికిదే తొలి మూవీ కూడా. ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లుధీర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పుడు మూడో చిత్రాన్ని కూడా ఓకే చేసాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నాంది(naandhi)తో సామాజిక స్పృహతో కూడుకున్న చిత్రాల్ని తెలుగు తెరపై ఆవిష్కరించిన విజయ్ కనకమేడల(vijay kanakamedala)దర్శకుడని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఒక క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం ఉంది. కాకపోతే బైరెడ్డి సినిమా తర్వాతే విజయ్ సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇంకో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే ప్రముఖ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో చేసే అవకాశం కూడా ఉందనే సమాచారం కూడా వస్తుంది. ఇదే జరిగితే క్రేజి మల్టీస్టారర్ కూడా అవ్వచ్చు. బ్యానర్ విషయంలో కూడా మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.