English | Telugu
దేవికి లెజెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట...!
Updated : Mar 7, 2014
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య "లెజెండ్" సినిమా ఫస్ట్ లుక్, స్మాల్ టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు నేడు సాయంత్రం శిల్పకళావేదికలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ వేదిక దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకలో దేవిశ్రీప్రసాద్ స్పెషల్ షో చేయబోతున్నాడని తెలిసింది.
దేవి సంగీతం అందించిన ప్రతి సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో తన హుషారైన పాటలతో అభిమానులను, ప్రేక్షకులను సినిమా ఆడియోపైన ఉండే అంచలను మించకుండా ఆడి,పాడి ఉత్సాహపరిచేవాడు. అయితే బాలయ్య సినిమాకు దేవి మొదటిసారిగా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ ఆడియో వేడుకలో దేవికి బాలయ్య ఉత్సాహపరిచే విధంగా రచ్చ రచ్చ చేసి అభిమానులను అలరించు అనే విధంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలిసింది. ఇక దేవి కూడా స్టేజ్ మీద అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడని తెలిసింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 28న లేదా ఏప్రిల్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.