English | Telugu

మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయినట్లేనా..?

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మెగా కుటుంబసభ్యులు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యుడు, హీరో రాంచరణ్ స్పందించాడు. "నా సపోర్ట్ ఎప్పుడు నాన్నకే. ఎవరి దారి వారిదే. నా దారి నాదే.. బాబాయ్ దారి బాబాయ్ దే. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు" అని తెలిపారు.

చరణ్ మాట్లాడిన విధానం చూస్తుంటే మెగా ఫ్యామిలీలో చీలిక ఏర్పడినట్లే అని అర్థమవుతుంది. ప్రస్తుతం నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. చిరంజీవి, రాంచరణ్, అల్లు అరవింద్ ఒక వైపు అన్నట్లుగా ఉంది. మరి పవన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా లేదా అనే విషయం మార్చి14వ తేదిన మాదాపూర్ లో ప్రకటించనున్నాడు. మరి పవన్ పార్టీ పెడితే మెగా అభిమానులు కూడా రెండు భాగాలుగా చీలిపోతారు కావచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.