English | Telugu

తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది.. పాన్ ఇండియా సినిమా 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna),పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మధ్య సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను మంచి అనుబంధం ఉంది. ఇద్దరు ఒకరికొకరు సోదర భావంతో మెలుగుతు ఉంటారు పవన్ కెరీర్ తొలి నాళ్ళల్లో చేసిన 'సుస్వాగతం' బాలకృష్ణ చేతుల మీదుగానే ప్రారంభమయ్యింది. . ఇద్దరు తమ అప్ కమింగ్ సినిమాలు 'అఖండ పార్ట్ 2 '(Akhanda 2), ఓజి'(Og)తో బిజీగా ఉన్నారు. వీటిల్లో 'ఓజి' రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకి హిందూపురం అసెంబ్లీ సభ్యుడి హోదాలో 'బాలకృష్ణ' హాజరయ్యాడు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో కొంత మంది ఎంఎల్ఏ, మంత్రులు బాలకృష్ణతో, అఖండ 2 విడుదల ఎప్పుడని అడిగారు. అందుకు బాలకృష్ణ మాట్లాడుతు 'ఎల్లుండి తమ్ముడు పవన్‌ సినిమా విడుదలవుతోంది. అఖండ-2 డిసెంబర్‌ 5న విడుదలవుతోంది. పాన్‌ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్‌ కూడా చాలా వచ్చిందని చెప్పుకొచ్చాడు.

2021 లో వచ్చిన 'అఖండ' సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖండ సీ క్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా చేస్తుండగా, బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని తో కలిసి 14 రీల్స్ ఆచంట గోపినాధ్, రామ్ నిర్మిస్తున్నారు.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.