English | Telugu

‘బాహుబలి' ఆడియోకి రికార్డ్ ప్రైస్

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమౌళి చిత్రంలోని క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్‌ చిత్రంపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన రాజమౌళి చిత్రాల్లోని పాటలను మించేలా కీరవాణి ఈ చిత్రంలోని పాటలను రూపొందించారట. బాహుబలి మొదటి భాగం ఆడియోలో మొత్తం ఎనిమిది పాటలు వున్నాయట. టాలీవుడ్ ఫేమస్ లిరిక్స్ రైటర్స్ చేత కీరవాణి ఈ పాటలను రాయించారట. మే 31న ఆడియో తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజింగ్ హక్కులు భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం లహరి మ్యూజిక్ సంస్థ దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి ఈ సినిమా తెలుగు, తమిళ ఆడియో హక్కుల్ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇండియాలో గతంలో ఏ సినిమా ఆడియో రైట్స్‌కి ఇంత ఎక్కువ ధర పలకలేదని ఇండస్ర్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.