English | Telugu

ఏప్రిల్ 18న అవతారం

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గొప్ప దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం "అవతారం". మాములుగా జనాలకు కష్టం వస్తే దేవుళ్ళు సహాయం చేసి, ఆ కష్టాలను తొలగిస్తారు. మరి దేవతలకు కష్టం వస్తే ఎవరు సహాయం చేస్తారు? అలా దేవతలను కాపాడాలంటే భక్తులే కాపాడాలి అనే కథాంశంతో తెరకెక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తుంది. అరుంధతీ ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై యువ నిర్మాత యుగంధర్ రెడ్డి నిర్మించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.