English | Telugu

అల్లుడు శ్రీనుకి 10కోట్ల దెబ్బ..!

బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా పరిచయమైన సినిమా 'అల్లుడు శ్రీను'. ఈ సినిమాకి మొదటి వారంలో కలెక్షన్లు బాగానే వచ్చిన రెండోవారానికి వచ్చే సరికి బాగా నిరసించాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అదికాక 'రన్ రాజా రన్' దెబ్బకి మెట్రో సెంటర్స్ లో ఈ సినిమా ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 'బిసీ' సెంటర్లలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఇంకా తగ్గలేదని, కాకపోతే మరోవారంలో రిలీజ్ కాబోయే పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడడం కష్టమే.కొడుకు సినిమా కావడంతో బెల్లంకొండ సురేష్ ఎక్కడా రాజీపడలేదట. ఈ చిత్రానికి దాదాపు 35కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ప్రస్తుతానికి 15 కోట్లు మాత్రమే రాబట్టిన 'అల్లుడు శ్రీను' ఓవరాల్ గా అన్ని కలిపి ఓ 25 కోట్లతో ముగింపు పలుకుతాడని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే 'అల్లుడు శ్రీను'కి 10కోట్ల దెబ్బపడడం ఖాయమని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.