English | Telugu
భార్యను మరోసారి ప్రేమిస్తున్నాడట...!
Updated : Mar 10, 2014
అల్లు అర్జున్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా తన ఆనందాన్ని తెలిపారు. "తండ్రి అవడం అంటే మరోసారి ప్రేమలో పడడమే. భార్యను మరోసారి ప్రేమించడం మొదలు పెట్టా. పుట్టబోయే బిడ్డకోసం మేమిద్దరం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా" అని తెలిపారు. ఈ విశేషంతో పాటు తన భార్య స్నేహతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోను కూడా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం బన్నీ "రేసుగుర్రం" సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.