English | Telugu

దర్శకుల సంఘం ఎన్నికల ఫలితాలు

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు నిన్న హైదరాబాదులో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా వీరశంకర్ ఘనవిజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా కాశీవిశ్వనాధ్, చంద్ర మహేష్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా మద్దినేని రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాయివెంకట్, కృష్ణమోహన్, కోశాధికారిగా కాదంబరి కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాలాజీ, మధుర శ్రీధర్ లు గెలుపొందారు. మొదటిసారిగా ఈసీ మెంబర్ గా పోటీచేసిన ప్రియదర్శిని ఘన విజయం సాధించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. ఈ కార్యవర్గం రెండేళ్ళపాటు కొనసాగుతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.