English | Telugu

అక్కినేనికి సతీ వియోగం

అక్కినేనికి సతీ వియోగం ఏర్పడింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి భార్య, ప్రముఖ నిర్మాత అక్కినేని అన్నపూర్ణ గారు డిసెంబర్ 28 వ తేదీన, అంటే బుధవారం మధ్యాహ్నం స్వర్గస్తులైనారు. అన్న పూర్ణ స్టుడియోస్ బ్యానర్ ఆమె పేరుపైనే ఏర్పడింది. ఆ బ్యానర్ పై నిర్మించిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్టయ్యాయి. 1949 వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావుతో అన్నపూర్ణమ్మ గారి వివాహం జరిగింది. ఆ దంపతులకు అయిదుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలూ, ఇద్దరు మగపిల్లలు.

మగపిల్లల్లో అక్కినేని వెంకట్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. రెండవ అబ్బాయి కింగ్ నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోగా, నిర్మాతగా ఉన్నారు. మనవళ్ళు సుమంత్, సుశాంత్, అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో యువ హీరోలుగా ఉన్నారు. కన్నతల్లి మరణవార్తను విన్న నాగార్జున బెంగుళూరు నుండి హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. చనిపోయేనాటికి అన్నపూర్ణమ్మగారికి 79 సంవత్సరాలు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలనీ ఆ భగవంతుని కోరుతూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది తెలుగువన్ డాట్ కామ్.