English | Telugu

అఖిల్‌ తో రొమాన్స్ ఛాన్స్ కొట్టేయండి

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, ‘సిసింద్రీ’ అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కొద్దిరోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమై౦ది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది. అయితే ఈ సినిమాలో అఖిల్‌ పక్కన నటించే లక్కీ గర్ల్ ఎవరనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ అఖిల్ పక్కన నటించేది ఎవరు అన్నది ఇంకా ఖరారు చేయలేదట. మరీ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే అంచనాలు పెరిగిపోతాయని, కొత్త అమ్మాయి అయితే బెటర్ అని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ తెలియజేశాడు. కొత్తమ్మాయి కోసం ప్రస్తుతం అడిషన్లు జరుగుతున్నాయట. సో గర్ల్స్ అఖిల్‌ తో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు కూడా దక్కవచ్చు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేయ౦డి..!!!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.