English | Telugu

తెలుగునాట కళ్లుచెదిరేలా 'ఆదిపురుష్' బిజినెస్!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఆయన రేంజ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. తాజాగా 'ఆదిపురుష్'తో మరోసారి ఆయన తన రేంజ్ ఏంటో తెలియజేశాడు.

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రూ.170 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు టీసిరీస్ బ్యానర్ లోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న 'స్పిరిట్' చిత్ర నిర్మాణంలో సైతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఓ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.