English | Telugu

కమల్ కి సారీ చెప్పిన పీకే

లోకనాయకుడు కమల్ హాసన్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్. వివరాల్లోకి వెళితే... కమల్ సినిమా 'విశ్వరూపం'. ఈ సినిమా విడుదల విషయంలో కమల్ హాసన్ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవలేమో..! అని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అ సమయంలో పరిశ్రమ మొత్తం రానప్పటికి, సినీ ప్రముఖులు కొందరు వ్యక్తిగతంగా కమల్ కు మద్దత్తు పలికారు. అయితే ఆ సమయంలో వేరే పని వత్తిడి వల్ల అమీర్ స్పదించలేకపోయాడట. తాజాగా కమల్ తో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు అమీర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'విశ్వరూపం' విడుదల విషయంలో కమల్ హాసన్ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, వేరే పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత మద్దతు కూడా తెలపలేకపోయా. ఈ విషయమై ఇప్పటికీ చింతిస్తుంటాను. ఈ విషయంలో కమల్ కు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా'అని వ్యాఖ్యానించాడు అమీర్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.