English | Telugu

పవన్ ది షాడో కి అబ్బూరి రవి మాటలు

పవన్ "ది షాడో" చిత్రానికి అబ్బూరి రవి మాటలు వ్రాస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అమదిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, 2007 ఫెమీనా మిస్ ఇండియాగా ఎన్నికైన సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, సంఘమిత్ర ఫిలింస్, అర్కా మీడియా పతాకాలపై, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ది షాడో". పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న"ది షాడో" చిత్రానికి ముందుగా "గమ్యం, వేదం" చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) మాటలు వ్రాస్తున్నారని తెలిసింది.

కానీ ప్రస్తుతం అది నిజం కాదనీ ఈ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి మాటలను వ్రాస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అన్నవరం" చిత్రానికి అబ్బూరి రవి మాటలు వ్రాశారు. ఆ తర్వాత పవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాతలు వ్రాస్తున్నారు. ఈ "ది షాడో" చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్థన్ దర్శకత్వం వహించనున్నారు. విష్ణు వర్థన్ గతంలో అజిత్ హీరోగా నటిమచిన "బిల్లా" చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించారు. ఆ చిత్రం సూపర్ హిట్టయ్యింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.