English | Telugu

ఏమైనా సరే బికినీ మాత్రం వేయను !!


పాలకుండాల తల తలాడే అందాల తార తమన్నా వచ్చింది ఉత్తరాది నుంచే అయినా దక్షిణాదిలో పాగా వేసింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో తమన్నా టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో స్థానం సంపాదించింది. తర్వాత ఈ పాలరాతి బొమ్మ అందం, టాలెంట్ చూసి బాలీవుడ్ వాళ్ళు హిమ్మత్ వాలా సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా అంత గొప్ప విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తాజాగా సాజిద్ ఖాన్ రూపకల్పనలో వస్తున్న హమ్‌షకల్స్ చిత్రంలో నటిస్తోంది తమన్నా. అయితే ఇది మల్లీస్టారర్ చిత్రం. అయినా సరే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఎంతమంది తారలున్నా కలిసి నటించడం ఇష్టమే అంటోంది తమన్నా. సినిమాలో అందరూ బాగా చేస్తేనే సినిమా బాగా ఆడుతుంది. దానికోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అంటూ పాజిటివ్‌గా మాట్లాడుతోందిట.


హమ్‌షకల్స్ చిత్రంలో తమన్నా సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ఇందులో తమన్నాతో పాటు బిపాషా బసు, ఈషాగుప్తాలు కూడా నటిస్తున్నారు. సినిమా గురించి, సినిమాలో టీం వర్క్ గురించి, తారల గురించి ఎన్నో పాజిటివ్ విషయాలు చెప్పిన తమన్నా డైరెక్టర్‌కి మాత్రం ఒక విషయంలో నో చెప్పిందట. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు బికినీ వేసుకుని కనిపించాల్సిన సన్నివేషం ఒకటి ఉందని డైరెక్టర్ చెప్పారట. తమన్నా అందుకు ససేమీరా కుదరదని చెప్పిందట. ఈ సీన్‌లో బికినీకి బదులు షార్ట్ టాప్, షార్ట్స్ వేసుకుని కనిపిస్తుంది తమన్నా. గతంలో చాలా సార్లు బికినీ అయితో నేను వేసుకోను అని చెప్పిన తమన్నా ఇలా చెయ్యటంతో అవకాశం కోసం, లేదా పాత్రకు తగ్గట్టుగా మారాలి అని మాట మార్చేసే హీరోయిన్ కాదని తేలిపోయింది. కానీ ఇలా అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న బాలీవుడ్లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి మరి

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.