English | Telugu

చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి

రాఖీ పౌర్ణమి సందర్బంగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రం చౌహాన్ భోఫాల్‌లో ఓ చెట్టుకు రెండు రాఖీలు కట్టారు. తరువాత ఆ చెట్టు హారతి ఇచ్చారు. చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, పక్షులు, ఇతర జీవరాశులు కుడా చెట్లనే జీవనాధారమని చౌహాన్ తెలిపారు. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో బంధాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఆ త‌ర్వాత కొంద‌రు మ‌హిళ‌లు, అమ్మాయిలు.. మంత్రి శివ‌రాజ్‌కు రాఖీ క‌ట్టారు. ఆ ఆడ‌ప‌డుచుల‌ను ఆయ‌న ఆశీర్వ‌దించారు.