English | Telugu
చిత్రసీమలో గుసగుసలు.. దాసరితో చిరు సినిమా..?
Updated : Jun 21, 2016
చిరంజీవి, దాసరి నారాయణరావు.. ఇద్దరు ఇండస్ట్రీలోనే కాకుండా తమ తమ రంగాల్లో నెంబర్ వన్ అనిపించుకొన్నారు. అప్పట్లో వీరిద్దరి దోస్తీ బాగానే ఉండేది. కాని కొన్నాళ్ళ తరువాత ఆధిపత్యపోరు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ చిరు, దాసరి ల మధ్య కోల్డ్ వార్ నడిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈమధ్యే వీరిరువురు మళ్లీ ఒక్కటయ్యారు. కాపు ఉద్యమంలో చేయి చేయి కలిపి నడుస్తున్నారు. ఈ బంధం మరింత బలపడబోతోందని, దాసరి, చిరు కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని చిత్రసీమలో గుసగుసలు మొదలయ్యాయి. దాసరి నిర్మాతగా బిజీ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. పవన్‌తో ఓ సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు చిరుతో ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నార్ట. అయితే ఈ ప్రాజెక్ట్‌కి దాసరి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని టాక్. చిరు 151వ చిత్రం దాసరి బ్యానర్‌లో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిరు సన్నిహితులు నోరు మెదపడం లేదు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో.. దాసరి, చిరులకే తెలియాలి..!