English | Telugu
ఆ హీరోయిన్ పెళ్లికాకుండానే.. కాపురమా?
Updated : Jun 21, 2016
ఈమధ్య ఓ కథానాయిక తన లవ్ మేటర్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఓ హీరోతో ప్రేమలో ఉన్నా... అనే సీక్రెట్ ని మీడియాకి చెప్పేసింది. అంతేకాదు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కావాలంటే ఆ హీరో ఎవరో గెస్ చేయండి అంటూ క్విజ్‌కాంపిటీషన్ లాంటిది పెట్టింది. ఆ హీరో, మరో ప్రముఖ హీరో తనయుడన్న విషయం టాలీవుడ్ అంతా పాకేసింది. ఈ విషయంపై హీరోయిన్ ఏం మాట్లాడకపోయినా, ఆ హీరో ఇప్పటి వరకూ నోరు విప్పకపోయినా... వీరిద్దరూ లవ్ లోఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం టాం టాం అయిపోయింది. ఇద్దరూ కలసి థియేటర్లో కనిపించారు. ఆ సంగతీ... హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇప్పుడు మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది.
పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే చోట కలసి ఉంటున్నార్ట. హైదరాబాద్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్లో కొంతకాలంగా ఈ ఇద్దరూ కలసి ఉంటున్నారని టాక్. ఈవిషయం సదరు హీరో డాడీకి తెలుసని, అయినా కామ్ గా ఉంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథానాయిక పెళ్లికి తొందరపెడుతోందని, కానీ బాబు గారే కొన్ని రోజులు ఆగమంటున్నారని టాక్. ఇలా పెళ్లి కాకుండానే కలసి ఉంటున్నారు.. త్వరగా ఆ పెళ్లి కూడా అయిపోతే.. ఓ పనైపోతుంది కదా?? మరి హీరో గారు.. వాళ్ల డాడీగారు... ఏం అనుకొంటున్నారో ఏమో?