English | Telugu
అంజలి లవ్వాట.. ఎవరితో?
Updated : Jun 18, 2016
తెలుగమ్మాయిల్ని తెలుగు పరిశ్రమలో అస్సలు పట్టించుకోరు.. అనేనిందకు నిదర్శనం అంజలి. ఈ రాజోలు పాపలో బోల్డంత టాలెంట్ ఉన్నా... మనవాళ్లకు అక్కరకు రాలేదు. గ్లామర్ షో చేయడానికి రెడీ అన్నా పట్టించుకోలేదు. ఆఖరికి ఐటెమ్ సాంగ్‌లకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా అలాక్కూడా వాడుకోవడం లేదు. కేవలం బొద్దుగా ఉంది.. అన్న ఒకే ఒక్క కారణంతో అంజలిని పక్కనపెట్టేస్తున్నారంతా. అంజలి కూడా తెలుగు సినిమాలపై ఆశలేం పెంచుకోవడం లేదు. ఎంచక్కా.. తమిళ సినిమాలు చేస్తోంది. అక్కడ అంజలికి ఇప్పటికీ డిమాండ్ ఉంది. తానూ అక్కడే సెటిలైపోదామని ఫిక్సయ్యిందో ఏమో.. ఇప్పుడు ఓ తమిళ హీరోతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు టాక్. ఆ హీరో ఎవరో కాదు.. జై.
జై - అంజలి ఇది వరకు జర్నీ సినిమాలో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి రాపో కుదిరిందట. ఈమధ్య ఈ ఇద్దరూ కలసి ఓ కొత్త సినిమాకి సంతకం చేశారు. అదో డిఫరెంట్ లవ్ స్టోరీనట. కెమెరా ముందే కాకుండా.. కెమెరా వెనుక
కూడా వీరిద్దరి కెమిస్ట్రీ అమోఘంగా కుదురుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమధ్య తన పుట్టిన రోజుకి అంజలి.. జైకి ప్రత్యేకంగా ఓ గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేసిందట. ఇదంతా చూస్తుంటే అంజలి - జై కాస్త తేడాగానే ఉందని.. తమిళ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అంజలిపై వచ్చిన రూమర్లకు, నడిపిన లవ్ స్టోరీలకూ అంతూ పొంతూ లేదు. అందులో ఇదీ ఒకటిగా చేరిపోతుందా, లేదంటే.. అంజలి ప్రేమకథ ఈసారి సుఖాంతం అవుతుందా? ఏమో.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.