Read more!

English | Telugu

ఇకపై నంది అవార్డులు ఉండవేమో !



రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో విషయాలలో సందిగ్దత నెలకొనివుంది. సినిమాకు సంబంధించిన అనేక అంశాలలో కూడా ప్రస్తుతం ఇదే వాతావరణం కనిపిస్తోంది. తెలుగు చిత్రరంగంలో ప్రతిష్టాత్మకంగా అందచేసే నందీ పురస్కారాలు ఇక మీదట అందజేస్తారా, లేదా అనే విషయం పై ఎటువంటి స్పష్టత లేదు. 1964 నుంచి మొదలైన నందీ అవార్డుల పరంపర తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏం కానుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ఏర్పాటు, అభివృద్ది పనులలో మునిగి వుండే అవకాశాలు ఎక్కువగా ఉంది.ఇక సినిమా రంగంలో మొదటి నుంచి తమకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం తెలంగాణాలో వుంది. ఈ నేపథ్యంలో నంది అవార్డుల గురించి రెండు ప్రభుత్వాలు దృష్టి సారించే అవకాశాలు తక్కువగానే వున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇకపై నంది అవార్డుల ప్రధానం జరుగదనే అనిపిస్తుంది.