English | Telugu
వెంకీ రాధా ఆగిపోయినట్లేనా...?
Updated : Feb 24, 2014
వెంకటేష్ హీరోగా నటించనున్న "రాధా" చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేనట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే ఈ సినిమా కథ విషయంలో చెలరేగిన వివాదంపై వెంకీ దర్శకుడు మారుతికి బాగానే క్లాస్ పీకినట్లు తెలిసింది. అంతే కాకుండా వెంకటేష్ ప్రస్తుతం "దృశ్యం", "ఓ మై గాడ్" రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాబట్టి మారుతి "రాధా" సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొంత కాలం ఆగాల్సిందే అని టాలీవుడ్ టాక్. అంతేకాకుండా "రాధా" కథను వెంకీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. పక్కాగా కథను సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయాలని వెంకీ ఫిక్స్ అయ్యాడని తెలిసింది. మరి మారుతి "రాధా" ఎప్పుడు పట్టలెక్కుతుందో త్వరలోనే తెలియనుంది.