English | Telugu

వెంకటేష్ బాడీగార్డ్ లో బికినీతో త్రిష

వెంకటేష్ "బాడీగార్డ్" లో బికినీతో త్రిష నటిస్తుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, అందాల నటి త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం "బాడీ గార్డ్" (ఈ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). మళయాళంలో సూపర్ హిట్టయిన "బాడీగార్డ్" చిత్రాన్ని తెలుగులో ఈ విధంగా పునర్నిర్మిస్తున్నారు.

గతంలో వెంకటేష్, త్రిష జంటగా, "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నమో వెంకటేశ" అనే చిత్రాల్లో నటించారు. వీళ్ళిద్దరూ కలసి నటిస్తున్న మూడవ చిత్రం ఈ "బాడీ గార్డ్". ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన "డాన్ శీను" చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ "బాడీ గార్డ్" చిత్రంలో త్రిష బికినీలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నదట. ఈ చిత్రంలో బికినీలో నటిస్తున్నందుకుగాను ఇరవై అయిదు లక్షలు అధికంగా తీసుకుంటుందట.