English | Telugu
మరోసారి దేవి మహేష్ శివ
Updated : Mar 22, 2014
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే. UTV మోషన్ పిక్చర్స్, ధనంజయన్ గోవింద్ ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు కన్ఫర్మ్ చేసారు.
ప్రభాస్ తో "మిర్చి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, రీ-రికార్డింగ్ అదిరిపోయింది. అయితే శివ, దేవి కలిసి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టును ప్రేక్షకులను అందించడానికి సిద్ధమయ్యారు. మహేష్ తో కూడా దేవి ఇటీవలే "1" చిత్రానికి అదిరిపోయే పాటలను అందించాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.
ప్రస్తుతం మహేష్ "ఆగడు" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.