English | Telugu

పెద్ది డేట్ కి ఉస్తాద్.. బాక్సాఫీస్ వార్ తప్పదా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026, మార్చి 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇదే తేదీపై 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కన్నేసినట్లు తెలుస్తోంది.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారు పవన్. అయితే ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని 2026 మార్చి 26 లేదా మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక రకంగా మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. బాబాయ్, అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ వార్ చూడబోతున్నామా అనే ఆందోళన వారిలో వ్యక్తమవ్వడం సహజం. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా 'పెద్ది' వాయిదా పడుతుందని, అందుకే ఆ డేట్ పై ఉస్తాద్ కన్నేసినట్లు సమాచారం. అంటే మెగా వార్ తప్పినట్లే అన్నమాట.

ఇదిలా ఉంటే, నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతోన్న 'ది ప్యారడైజ్'ను కూడా 2026, మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే, ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.

మరోవైపు, 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.