English | Telugu
నమ్రత, ఉపాసన చక్రం తిప్పేస్తున్నారా?
Updated : May 6, 2017
స్టార్ హీరోల కెరీర్ విషయంలో సతీమణులు క్రియాశీలక పాత్ర తీసుకోవడం అరుదైన విషయమే. ఒక్క మహేష్‌బాబుకే అది చెల్లింది. నమ్రత శిరోద్కర్ ఈమధ్య మహేష్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఒక విధంగా మహేష్‌కి సంబంధించినంత వరకూ తనే ఓ పీఆర్‌గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా ప్రచారం అంతా తానే చూసుకొంటున్నట్టు టాక్. ప్రింట్ మీడియాలో, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ పత్రికల్లో మహేష్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ వచ్చేలా చూసుకొంటోందట నమ్రత. మహేష్ ఇంటర్వ్యూ కావాలన్నా, అప్పాయింట్‌మెంట్ కావాలన్న ముందు నమ్రత దర్శనం చేసుకోవాల్సిందే. సేమ్ టూ సేమ్ అదే పద్ధతి ఇప్పుడు చరణ్ విషయంలోనూ జరుగుతోందని తెలుస్తోంది. రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకి మీడియా మేనేజ్‌మెంట్‌లో మంచి అవగాహన ఉంది. చరణ్ పీఆర్ వ్యవస్థ కాస్త వీక్‌గా కనిపిస్తున్న ఈ తరుణంలో ఆ బాధ్యతని ఉపాసన తీసుకొందట. చరణ్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఉపాసన కలుగు చేసుకొంటోందని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చరణ్ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వచ్చేలా జాగ్రత్త పడుతోందని తెలుస్తోంది. ఈమధ్య చరణ్ షూటింగులకూ ఉపాపన తరచూ వెళ్తోందని టాక్. మొత్తానికి మహేష్, చరణ్.. ఇద్దరూ తమ పెళ్లాల చేతుల్లోకి వెళ్లిపోయారన్నమాట.