English | Telugu

నాలుగోసారి తండ్రి కాబోతున్న పవన్..?

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ మూడో భార్య అన్నాలెజీనోవా రెండోసారి గర్భం దాల్చినట్లు ఫిలింనగర్ టాక్. మొదటి భార్య నందినితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినీనటి రేణూదేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత కొన్ని కారణాలతో రేణూ నుంచి విడాకులు తీసుకుని రష్యన్ పౌరురాలు అన్నాలెజీనావోని మూడో పెళ్లి చేసుకున్నారు పవన్. వీరికి పొలేనా అనే పాప ఉంది. అయితే రీసెంట్‌గా అన్నా ఓ షాపింగ్ మాల్‌లో బేబి బంప్‌తో కనిపించిందని, దీంతో పవర్ స్టార్ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీనిపై పవన్ కానీ మెగా కాంపౌండ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.