English | Telugu

ప‌వ‌న్‌, బ‌న్నీ సినిమాల్ని కాపీ కొట్టేశాడా?


శ‌ర్వానంద్ న‌టించిన‌ రాధ ట్రైల‌ర్ చూస్తే మెగా ఫ్యాన్స్‌కీ, సినిమా అభిమానుల‌కు బోల్డన్ని అనుమానాలు ముసురుకొంటున్నాయి. రాధ‌గా శ‌ర్వానంద్ విన్యాసాలు చూస్తుంటే గ‌బ్బ‌ర్ సింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌రైజేష‌న్ క‌నిపిస్తోంది. గ‌బ్బ‌ర్‌లో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌. కానీ.. స్టేష‌న్‌ని ఓ ప్లే గ్రౌండ్‌గా మార్చేస్తాడు. ఆ ఊర్లో అమ్మాయి ప్రేమ‌లో ప‌డిపోతాడు. స‌రిగ్గా ఇలాంటి ఎపిసోడ్లే... రాధ‌లో క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు రేసుగుర్రం లో ఓ భారీ ఎపిసోడ్‌ని త‌ల‌పిస్తోంది. హోం మినిస్ట‌ర్‌ని కాకాపట్టి... వ‌న్ డే పోలీస్ ఆఫీస‌ర్ అవ‌తారం ఎత్తుతాడు బ‌న్నీ. ఆ త‌ర‌వాత‌.. విల‌న్‌తో ఓ ఆట ఆడుకొంటాడు. రాధ కాన్సెప్ట్ కూడా స‌రిగ్గా ఇలానే సాగుతుంద‌ట‌.

మొత్తానికి మెగా హీరోల సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొనో,కాపీ కొట్టో... శ‌ర్వానంద్ ఓ సినిమా చేసేశాడు. ట్రైల‌ర్ అయితే బాగానే ఉంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. పాత సినిమాల్ని గుర్తు తెచ్చుకొని దీనిపై కాపీ ముద్ర వేస్తే శ‌ర్వాకు క‌ష్ట‌మే. క‌థ పాత‌దే అయినా.. ట్రీట్ మెంట్ బాగుంది అంటూ స‌ర్దుకుపోతే మాత్రం రాధ‌కు తిరుగులేదు. మ‌రి శ‌ర్వానంద్ ఏం చేస్తాడో, ఈ సినిమా చూసి మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో?