Read more!

English | Telugu

త్రివిక్ర‌మ్ - ప్ర‌ణీత‌ల మ‌ధ్య ఏం జరిగింది?

చిత్ర‌సీమ‌లో పుకార్ల‌కు కొద‌వ లేదు. ఎప్పుడూ ఏదో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య లింకులున్న‌ట్టు, వారి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లొస్తుంటాయ్‌. అందులో నిజానిజాలెలా ఉన్నా.. కావ‌ల్సినంత మ‌జా దొరుకుతుంటుంది. ద‌ర్శ‌కులూ ఇందుకు మిన‌హాయింపు కాదు. ఓ హీరోయిన్ ని మాటి మాటికీ త‌న సినిమాలో చోటిస్తుంటే అలాంటి అనుమానాలే పుడతాయి. త్రివిక్ర‌మ్ నీ ఇందుకు మిన‌హాయించ‌లేదెవ్వ‌రూ. త్రివిక్ర‌మ్‌కీ పార్వ‌తీ మెల్ట‌న్‌కీ మ‌ధ్య బోలెడు పుకార్లు పుట్టాయి. త్రివిక్ర‌మ్ సినిమా జ‌ల్సాలో రెండో నాయిక పాత్ర పోషించింది పార్వ‌తీమెల్ట‌న్‌. ఆ త‌ర‌వాత ఖ‌లేజాలో కూడా పార్వ‌తీ పేరు ప‌రిశీలించారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల అనుష్క‌ని తీసుకొన్నారు. పార్వ‌తీమెల్ట‌న్ తో త్రివిక్ర‌మ్‌కి చెడింద‌ని, అందుకే ఆమెను తొల‌గించాని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో మ‌రో నాయిక‌కు లింకులు క‌డుతున్నారు. ఆమే.. ప్ర‌ణీత‌.

ప‌వ‌న్ సినిమా అత్తారింటికి దారేదితో ప్ర‌ణీత రెండో హీరోయిన్‌. ఆ సినిమాతో త్రివిక్ర‌మ్‌, ప్ర‌ణీత‌ల మ‌ధ్య సంబంధం బాగా పెరిగిపోయింద‌ని, ఇద్ద‌రూ బాగా క్లోజ్ అయ్యార‌ని వార్త‌లొచ్చాయి. బ‌న్నీతో తెర‌కెక్కిస్తున్న చిత్రంలోనూ ప్ర‌ణీత‌ని ఓ క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని చెప్పుకొన్నారు. అయితే వీరిద్ద‌రి కూడా చెడింద‌ట‌. అందుకే ప్ర‌ణీత‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్ర‌ణీత‌తో కొన్ని రోజులు షూటింగ్ కూడా జ‌రిపార‌ని. సెట్లో ప్ర‌ణీత వ్య‌వ‌హారం న‌చ్చ‌క త్రివిక్ర‌మ్ ఆమెను తొల‌గించాడ‌ని చెప్పుకొన్నారు. అయితే వీటిపై చిత్ర‌బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. అస‌లు ఈ సినిమా కోసం ప్ర‌ణీత పేరునే ప‌రిశీలించ‌లేద‌ని, ఆమె షూటింగులో పాల్గొన‌డం ఏమిటి అని చిత్ర‌బృందం వాదిస్తోంది. ఆ మాట‌లో నిజ‌మెంత ఉన్నా... ఈ సినిమా కోసం ప్ర‌ణీత‌ని ఎంచుకోవాల‌ని త్రివిక్ర‌మ్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. అయితే ఆయ‌న త‌ప్ప మిగిలిన  చిత్ర‌బృందం ప్ర‌ణీత ఎంపిక‌ను స‌మ‌ర్థించ‌లేదు.  ప్ర‌ణీత వ‌స్తే... ఈ సినిమాకి అత్తారింటికి దారేది ఫ్లేవ‌ర్ వ‌చ్చేస్తుంద‌ని, అదంత మంచిది కాద‌ని వారించార‌ట‌. దాంతో త్రివిక్ర‌మ్ కూడా వెన‌క్కి త‌గ్గి.. మ‌రో క‌థానాయిక‌ను ఎంచుకొన్నారట‌. త్రివిక్ర‌మ్‌, ప్ర‌ణీత‌ల మ‌ధ్య ఏం జ‌రిగిందో అన‌వ‌స‌రం. బ‌న్నీ సినిమాలో అయితే ఆమె లేదు. సెట్‌కి కూడా రాలేదు. ఈ విష‌యంలో మాత్రం క్లారిటీ ద‌క్కింది.