Read more!

English | Telugu

త్రిష బికిని వేసిందట..!

 

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువయినట్లు తెలుస్తోంది. ఒకరి నుంచి ఒకరు పోటీ తట్టుకోవడానికి గ్లామర్ మంత్రాన్ని బాగా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత ఇటీవల విడుదలైన సికిందర్ లో బికినీలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆమె బికినికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఇదే బాటలో పయనించడానికి మరో భామ రెడీ అయ్యింది. ఒక్కప్పుడు సౌత్ లో టాప్ హీరాయిన్ గా వెలిగిన త్రిష తాజాగా ఓ కన్నడ సినిమా కోసం బికిని వేసినట్లు సమాచారం. మహేష్ దూకుడుని కన్నడంలో పవర్ గా రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమా కోసమే త్రిష బికిని వేసిందట. మరి త్రిష బికిని ఈ సినిమాకి ఎంత క్రేజ్ తెస్తుందో చూడాలంటే ఈ నెల 28 దాక వేచి ఉండాల్సిందే.