English | Telugu
ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!
Updated : Dec 9, 2025
సినీ పరిశ్రమలో డైరెక్టర్, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ లో త్వరలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు, హీరోయిన్ వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానూ అలరిస్తున్నాడు.
డైరెక్టర్ కి గతంలోనే వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్.. ఒక హీరోయిన్ కి దగ్గరైనట్లు తెలుస్తోంది. సినిమాలు, సిరీస్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ ఆమె. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వినికిడి.
కాగా.. ఆ డైరెక్టర్, ఆ హీరోయిన్ కలిసి రీసెంట్ గా ఒక సినిమా కూడా చేశారు. త్వరలో అది విడుదలకు సిద్ధమవుతోంది.